రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ప్రమాదంలో సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈఓ మృతి

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సీటీలో జరిగిన ఓ సాప్ట్ వేర్ కంపెనీ ఈవెంట్ లో అపశృతి చోటుచేసుకుంది. జనవరి 18వ తేదీ గురువారం రామోజీ ఫిల్మ్ సీటీలో విస్టెక్స్ అనే ఎంఎన్ సీ కంపెనీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు హాజరయ్యేందుకు అమెరికాలోని చికాగోలో ఉంటున్న కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ, చీఫ్ అర్కికెట్ సంజయ్ షా(56) హైదరాబాద్ కు వచ్చారు. నిన్న రాత్రి ఆర్ఎఫ్ సిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో సుమారు 700 మంది పాల్గొన్నారు. ఈ క్రమంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ జరుగుతుండగా రాత్రి11గంటల సమయంలో ప్రమాదవశాత్తు ఈవెంట్ కోసం వేసిన సెట్టు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సంజయ్ షాతోపాటు విశ్వనాధ్ రాజ్ (54) అనే మరొకరిని వెంటనే చికిత్స కోసం మలక్ పేట్ యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ శుక్రవారం సంజయ్ మరణించారు. ఈ సంఘటనకు కారకులైన రామోజీ ఈవెంట్స్ ఆథారిటీపై కంపెనీ ఎక్స్ క్యూటివ్ డైరెక్టర్ ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్ 336,287,r/w 34 చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్త చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)