మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు

Telugu Lo Computer
0


త్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు మావోలు దుశ్చర్యకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత దంతెవాడ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. అయితే పోలీసులే లక్ష్యంగా ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఎన్నికల ఫలితాలకు ముందు ఈ ఘటన జరగడంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి విధ్వంసకర సంఘటనలు జరగకుండా.. చర్యలు తీసుకుంటున్నారు. నక్సలైట్లు పీఎల్‌జీఏ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమం సందర్భంగా పలు చోట్ల బ్యానర్లు, పోస్టర్లు అంటించారు. వాటిని తొలగించేందుకు 195 బెటాలియన్‌ పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో బార్సుర్‌పల్లి సమీపంలో పోలీసులే లక్ష్యంగా అమర్చిన మందుపాతరను మావోయిస్టులు పేల్చారు. దీంతో తీవ్ర గాయాలైన ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనలో ఓ జర్నలిస్ట్ కు కూడా గాయాలయ్యాయి. అయితే వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌తో సహా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డిసెంబరు 2 నుంచి డిసెంబర్ 8 వరకు నక్సలైట్లు పీఎల్‌జీఏ వారోత్సవాల 23వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నక్సలైట్లు ప్రతి సంవత్సరం డిసెంబర్ 2 నుండి 8 వరకు ఈ వారొత్సవాన్ని జరుపుకుంటారు. నక్సలైట్లు గెరిల్లా యుద్ధం కోసం 2000 సంవత్సరంలో PLGAని స్థాపించారు. ఈ సందర్భంగా నక్సలైట్లు ప్రతి సంవత్సరం పీఎల్‌జీఏ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటారు.

Post a Comment

0Comments

Post a Comment (0)