ఎంగిలి ప్లేట్లు తగిలాయని కొట్టి చంపారు !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గత నెల 17న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంకుర్ విహార్ సీజీఎస్ వాటికలో పంకజ్ అనే ఓ వ్యక్తి వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, పెళ్లిలో తిన్న ఎంగిలి ప్లేట్లను శుభ్రం చేసేందుకు పంకజ్ తీసుకెళ్తుండగా అవి కాస్తా రిషభ్ అనే వ్యక్తితో పాటు అతడి ఇద్దరు స్నేహితులకు తగిలాయి. తిన్న ప్లేట్లను మాకే తాకిస్తావా అన్న కోపంతో వారు ముగ్గురూ తీవ్ర కోపోద్రిక్తులయ్యారు. కోపంతో రగిలిపోయిన రిషబ్ అతడి స్నేహితులైన మనోజ్‌, అమిత్ కలిసి పంకజ్‌ను అక్కడే దారుణంగా కొట్టారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన అక్కడిక్కడే మృతి చెందాడు. పంకజ్ డెడ్‌బాడీని చూసిన ఆ ముగ్గురు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఏం చేయాలో తెలీక ఆందోళన చెందారు. తర్వాత ఏమౌతుందో నన్న భయంతో రిషభ్, అతడి స్నేహితులు కలిసి పంకజ్ మృతదేహాన్నిసమీపంలో ఉన్న ఓ అడవిలో దాచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ మరుసటి రోజు బాధితుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుకున్న నిందితులు పోలీసులు బారిన పడకుండా తప్పించుకు తిరిగారు. అయితే, తాజాగా పరారీలో ఉన్న ముగ్గురు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)