లలిత్ ఝాకు ఏడు రోజుల పోలీస్ కస్టడీ !

Telugu Lo Computer
0


పార్లమెంట్ భద్రతను ఉల్లంఘించి, దాడికి యత్నించిన కేసులో మాస్టర్ మైండ్‌గా చెప్పబడుతున్న లలిత్ ఝాకి ఢిల్లీ పాటియాల హౌజ్ కోర్టు ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఢిల్లీ పోలీసులు పోలీసులు 15 రోజలు కస్టడీ కోరగా, కోర్టు 7 రోజులకు పరిమితం చేసింది. ఈ దాడి ఘటనలో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు. అయితే పరారీలో ఉన్న లలిత్ ఝా గురువారం పోలీసులకు లొంగిపోయాడు. ఈ కేసులో పార్లమెంట్ లోపల ఘటనకు పాల్పడిన సాగర్ శర్మ, మనోరంజన్‌తో పాటు వెలుపల నీలందేశీ, అమోల్ షిండేను అరెస్ట్ చేశారు. భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన నలుగురు నిందితులను గురువారం కోర్టు 7 రోజుల కస్టడీ విధించింది. వీరిపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం USPA కింద అభియోగాలు నమోదు చేసింది. మరో నిందితుడు విశాల్ శర్మ అలియాస్ విక్కీని గురుగ్రామ్‌లోని అతని ఇంటిలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. విప్లవ భావజాలం కలిగిన వీరంతా దేశం దృష్టిని ఆకర్షించేందుకు ఈ ఘటనకు పాల్పడినట్లు తేలింది. దీంతో పాటు ఒకవేళ ప్లాన్-ఏ విఫలమైతే, ప్లాన్-బీకి పాల్పడేందుకు ప్రధాన సూత్రధారి లలిత్ ఝా కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. రైతులు నిరసన, మణిపూర్ అంశం, నిరుద్యోగం వంటి సమస్యలతో కలత చెందడంతో ఈ దాడికి పాల్పడినట్లు నిందితులు పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)