బియ్యం ధరలు పెరుదల !

Telugu Lo Computer
0


రోజురోజుకు సన్నబియ్యం ధరలు పెరుగుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల్లోనే క్వింటా సన్న బియ్యం ధర రూ.800 వరకు పెరిగింది. ప్రస్తుత మార్కెట్‌లో సన్నబియ్యం సోనమసూరి, బీపీటీ, ఆర్‌ఎన్‌ఆర్‌ రకాలకు చెందిన పాత య్యం రూ.6,400 వరకు ధర పలుకుతుండగా, కొత్త బియ్యం క్వింటా రూ.5,400 వరకు ధర చేరింది. గతేడాది నవంబర్‌, డిసెంబర్‌లో రూ.4,400 నుంచి రూ.4,800 ధర ఉన్న పాత బియ్యం, ప్రస్తుతం రూ.1200లకు పెరిగింది. హంస బియ్యం ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. పాత హంస బియ్యం ధర దాదాపు రూ.4వేల వరకు ఉంది. సన్న వడ్ల ధర పెరగడంతో కొందరు రైతులు తాము పండించిన సన్న వడ్లను నేరుగా మిల్లుకు తరలించి బియ్యంగా మార్చుకుంటున్నారు. బియ్యం ధర అధికంగా పెరుగుతుండటంతో సదరు బియ్యాన్ని తర్వాత నేరుగా విక్రయించుకుంటే మరింత లాభం వస్తుందని రైతులు భావిస్తున్నారు. పెట్టుబడి ఖర్చుల నిమిత్తం తాము పండించిన సన్న వడ్లను కొంత భాగం అమ్ముకొని, మరికొంత భాగాన్ని బియ్యంగా మార్చుకుంటున్నారు. బి య్యం రెండు మూడు నెలలు ఉంచితే పా తగా మారుతాయి. అదనంగా క్వింటాకు రూ.వెయ్యి వరకు మిగులుతాయని రైతు ల అంటున్నారు.ధరల పెరుగుదలకు రెం డు కారణాలున్నాయని బియ్యం వ్యా పారులు చెబుతున్నారు. బియ్యాన్ని బ యటి రాష్ర్టాలకు ఎగుమతి చేయ డం, రెండోవది మిగ్‌జాం తుఫాను దాటికి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో వరి దెబ్బతినడమని వ్యాపారులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లోనే బియ్యం ధరలు పెరుగుతున్నాయి. బియ్యం ఎక్కువగా ఉపయోగించే దేశాల్లో కరువు తదితర పరిస్థితుల వల్ల ఎక్కువ డిమాండ్‌ ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులకు 20శాతం పన్ను విధిస్తున్నా ఎగుమతులు ఆడగం లేదు. దీనికి తోడు మిగ్‌జాం తుపాన్‌ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతంలో వరి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)