ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరించి మెక్సికో యువతిపై అత్యాచారం !

Telugu Lo Computer
0


ముంబైలో మ్యూజిక్ ఈవెంట్ కంపెనీ 'స్లిక్ ఎంటర్‌టైన్‌మెంట్' యజమాని ప్రతీక్ పాండే తనతో సెక్స్ లో పాల్గొకుంటే డిస్క్ జాకీ (డీజే) జాబ్ నుంచి తీసేస్తానని 31 ఏళ్ల మెక్సికో యువతిని బెదిరించి లొంగదీసుకున్నాడు. ప్రతిసారి ఇలాగే బెదిరిస్తూ 2019 నుంచి ఎన్నోసార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి వేధింపులతో విసిగి వేసారిన మహిళ చివరకు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మ్యూజిక్ ఈవెంట్ కంపెనీ 'స్లిక్ ఎంటర్‌టైన్‌మెంట్' యజమాని, 36 ఏళ్ల ప్రతీక్ పాండేను పోలీసులు అరెస్టు చేశారు. పాండేకు 2020లో వివాహం అయింది. అయితే అంతకుముందు 2017లోనే సోషల్ మీడియా ద్వారా మెక్సికో యువతికి, ప్రతీక్ పాండేకు పరిచయం ఏర్పడింది. మోడల్ కావాలనే ఆశయంతో ఆమె 2019లో ముంబైకి చేరుకుంది. ఈ క్రమంతో తనను కలవగానే మెక్సికో యువతికి డీజేగా ప్రతీక్ జాబ్ ఇచ్చాడు. ఇది జరిగిన ఒక నెల వ్యవధిలోనే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరిస్తూ మెక్సికో యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెకు అసభ్య ఫొటోలు, మెసేజ్‌లను ఫోన్‌లో ప్రతీక్ పంపేవాడు. ఈ వివరాలన్నీ మెక్సికో యువతి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు ప్రతీక్ పాండేపై అత్యాచారం, అసహజ సెక్స్, క్రిమినల్ బెదిరింపు, లైంగిక వేధింపులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టానికి సంబంధించిన పలు సెక్షన్ల కింద బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రతీక్ పాండేను కోర్టు పోలీసు కస్టడీకి అప్పగించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)