ఆంధ్రప్రదేశ్‌లో మూడు కరోనా కేసులు నమోదు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవి పాత వేరియంట్‌వా లేక, కొత్త వేరియంట్‌వా అనేది తేలాల్సి ఉంది. ఇప్పుడు టెస్టులు చేస్తున్నారు కాబట్టే, కేసులు వెలుగు జూస్తున్నాయని కొందరు అంటున్నారు. కరోనా ఎప్పటి నుంచో ఉన్నా, ఇన్నాళ్లూ టెస్టులు చెయ్యకపోవడం వల్ల అది బయటపడలేదని అంటున్నారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 328 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,997కి పెరిగింది. తాజాగా కేరళలో ఒకరు చనిపోగా, ఆంధ్రప్రదేశ్‌లో 3, బీహార్‌లో 2 కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. ఈ కొత్త కేసుల్లో కొత్త వేరియంట్ కేసులు ఎన్ని అన్నది స్పష్టం కాలేదు. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. హ్యాండ్ శానిటైజర్ వాడాలనీ, మాస్క్ ధరించాలని కోరుతున్నారు. తెలంగాణలో స్కూల్ పిల్లలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని రూల్ తెచ్చారు.


Post a Comment

0Comments

Post a Comment (0)