సలార్ సినిమా ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ తగిలి అభిమాని మృతి !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో  సలార్ విడుదల సందర్భంగా కరెంట్ షాక్‏తో ఓ అభిమాని మృతి చెందాడు. పట్టణంలోని రంగ థియేటర్‏ ఎదుట గురువారం ఒక ఇంటిపై ఫ్లెక్సీ కడుతూ హీరో ప్రభాస్ అభిమాని  బాలరాజు (27) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. తమ అభిమాన హీరో నటించిన సలార్ శుక్రవారం విడుదలకానుండడంతో అనంతపురం తపోవనానికి చెందిన బాలరాజు.. అతడి స్నేహితులు ఫ్లేక్సీ ఫ్రేమ్ తయారు చేయించి స్వయంగా వారే కడుతుండగా.. ఫ్రేమ్ కు ఉన్న ఇనుప చువ్వ ఇంటిపై ఉన్న కరెంట్ తీగలను తాకడంతో కరెంట్ షాక్‏కు గురై బాలరాజు అక్కడికక్కడే కన్నుమూశాడు. గజేంద్ర అనే యువకుడు గాయపడ్డాడు. ప్రమాదం నుంచి మరో నలుగురు యువకులు బయటపడ్డారు. కరెంటు తీగలు తక్కువ ఎత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని బాలరాజు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతిచెందిన బాలరాజు దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. కొంతకాలంగా కనగానపల్లి మండలం మామిళ్లపల్లిలో నివాసం ఉంటున్నాడు. బాలరాజు హీరో ప్రభాస్ వీరాభిమాని. మృతుడికి భార్య శిరీష, ఇద్దరు కుమారులు ఉన్నారు. ధర్మవరం ఒకటో పట్టణ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)