తుఫాన్ బాధితులకు వరద సాయం అందించిన స్టాలిన్ !

Telugu Lo Computer
0


మిచౌంగ్‌ తుఫాను తమిళనాడులో తీవ్ర ప్రభావం చూపింది. చెంగల్పట్టు, కాంచీపురం మరియు తిరువళ్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లోఅధిక వర్షాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తీవ్ర నష్టం వాటిల్లింది.వర్షాలు మరియు వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు సహాయ సహకారాలు కొరకై ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నేతృత్వంలో రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సంప్రదింపుల సమావేశంలో వరద నష్టం, అందించాల్సిన పరిహారం మొత్తంపై చర్చించారు. వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు పరిహారం మొత్తాన్ని 4 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచాలని ఆదేశించారు. దెబ్బతిన్న గుడిసెలకు ఇప్పటికే ఇస్తున్న రూ.5వేలను రూ.8వేలకు పెంచాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావితం అయిన ప్రతిఒక్కరికి 6 వేలు చొప్పున ఇవ్వనున్నారు. వర్షం కారణంగా దెబ్బతిన్న వరితో సహా ఇతర పంటలకు హెక్టారుకు రూ.13,500/- నుండి రూ.17 వేలకు పెంచాలని ఆయన ఆదేశించారు. శాశ్వత పంటలు మరియు చెట్లకు నష్టం జరిగితే హెక్టారుకు 18 వేల రూపాయల నుండి 22,500 రూపాయలకు పరిహారం పెంచాలని ఆయన ఆదేశించారు. వర్షాభావ పంటలకు హెక్టారుకు రూ.7,410/- నుండి రూ.8,500/-లకు పెంచాలని కూడా ఆయన ప్రతిపాదించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)