తాళి కట్టే సమయంలో అడ్డం తిరిగిన పెళ్లి కూతురు !

Telugu Lo Computer
0

ర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హోసదుర్గ తాలూకాలోని చిక్కబ్యాలదకెరె గ్రామానికి చెందిన ఓ యువకుడికి  ఓ యువతితో పెద్దలు పెళ్లి సంబంధం కుదుర్చారు. వీరి పెళ్లికి గురువారం ముహుర్తంగా నిర్ణయించారు. ఈ క్రమంలో వరుడి కుటుంబ సభ్యులు గ్రాండ్​గా పెళ్లి ఏర్పాట్లు చేశారు. చిక్కబ్యాలదకెరెలోని భైవవేశ్వర్ కళ్యాణమండపానికి వరుడు, వధువు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వచ్చారు. పెళ్లి తంతులో భాగంగా బంధువుల సమక్షంలో పెళ్లి కూతురు మెడలో పెళ్లి కొడుకు తాళి కట్టేందుకు సిద్ధమయ్యాడు. తన మెడలో మంగళసూత్రాన్ని కట్టించుకునేందుకు వధువు నిరాకరించింది. తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. అక్కడ ఉన్నవారంతా ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా పెళ్లి కూతురు ఎవరి మాట వినిలేదు. ఇదంతా జరుగుతుండగానే పెళ్లి కొడుకు షాక్ అయ్యాడు. తాళి పట్టుకుని.. నిల్చుని చూస్తుండిపోయాడు. వధువు మొండికేయడంతో చివరకు పెళ్లి ఆగిపోయింది. వధువు తీరుపట్ల వరుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వధువు కుటుంబ సభ్యులతో గొడవకు దిగారు. చివరకు ఈ విషయం శ్రీరాంపుర్​ పోలీస్ స్టేషన్​కు చేరింది. పెళ్లికి అయిన ఖర్చులు వధువు తరఫు వారే భరించుకోవాలని పోలీసులు ఇరువర్గాల మధ్య రాజీ కుదర్చడం వల్ల గొడవ సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్  మీడియాలో వైరల్ గా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)