ఆస్ట్రేలియా గడ్డపై పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు తీవ్ర నిరాశ !

Telugu Lo Computer
0


స్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కోసం కంగారూల గడ్డపై దిగిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు ఎవరూ అక్కడికి రాలేదు. పాకిస్తాన్ ఎంబసీ అధికారులు కూడా హాజరు కాలేదు. ఆటగాళ్లు తమ లగేజీని స్వయంగా ట్రక్కులో ఎక్కించుకుని హోటల్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆటగాళ్లు లాహోర్ విమానాశ్రయం నుంచి బయలుదేరి సిడ్నీ విమానాశ్రయంలో దిగారు. పాక్ ఎంబసీ, క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు ఎవరూ ఇక్కడికి పాకిస్తానీ ఆటగాళ్లను స్వాగతించడానికి లేదా ఎస్కార్ట్ చేయడానికి రాలేదు. దీంతో జట్టు సభ్యులు తమ లగేజీని స్వయంగా తీసుకెళ్లాల్సి వచ్చింది. వైరల్ అవుతున్న వీడియోలో మొహమ్మద్ రిజ్వాన్ తన సహచరుల కిట్ బ్యాగ్‌లను లోడ్ చేయడానికి ట్రక్కు లోపల నిలబడి ఉన్నట్లు వుంది. బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిదితో సహా ఆటగాళ్లు ట్రిక్‌లో లగేజీని ప్యాక్ చేస్తున్నారు. దీంతో పాక్ ఆటగాళ్ల బస, రాబోయే సిరీస్‌ల కోసం మొత్తం ఏర్పాట్ల గురించి ఊహాగానాలు ఎలా ఉండనున్నాయో తెలుస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)