గాలిలో విమానం కూడా కదులుతుందా ?

Telugu Lo Computer
0

                                       

ర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో వీచిన బలమైన గాలులు విమానాలను సైతం కదిలించేశాయి. తూర్పు అర్జెంటీనాను భారీ తుఫాను హడలెత్తిస్తోంది ఈదురు గాలి ధాటికి రన్‌వేపై పార్క్ చేసిన విమానం పక్కకు జరిగింది. దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో గాలి వీచింది. అర్జెంటీనా విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతోంది. అర్జెంటీనాలో భీకర గాలివాన వచ్చింది. బ్యూనస్ ఏరిస్ సమీపంలోని ఏరోపార్క్ జార్జ్ న్యూబెరీ విమానాశ్రయం పార్కింగ్‌లో ఉన్న ఓ ప్రైవేటు విమానం ఆ గాలి ధాటికి పక్కకు కదిలింది. రన్‌వేపై నిలిచిన ఆ విమానం.. జోరుగా వీస్తున్న గాలి ప్రభావానికి స్పిన్ అయ్యింది. అదే రన్‌వేపై ఉన్న బోర్డింగ్ స్టెప్స్ కూడా పక్కకు ఒరిగాయి.  @Rainmaker1973 అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 9.4 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ తుఫాను ధాటికి బ్యూనస్ ఎయిర్స్ నాశనం అవుతోందని ఒకరు కామెంట్​ చేశారు. అసాధారణ వాతావరణ పరిస్థితులకు ఎవరైనా తలవంచాల్సిందే ఇంకొకరు పోస్ట్​ చేశారు ప్రకృతి వైల్డ్‌గా మారితే ఎవరూ ఏమీ చేయలేరు అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)