ఆస్పత్రిలోకి చిరుత పులి !

Telugu Lo Computer
0


హారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా  షహాదా ప్రాంతంలోని ఆదిత్య ప్రసూతి, కంటి ఆస్పత్రిలోకి ఓ చిరుత పులి ప్రవేశించింది. ఆస్పత్రికి వచ్చిన ఓ కార్మికుడు చిరుతపులిని చూసి భయంతో కేకలు వేయడంతో ఆస్పత్రిలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఆ అరుపులకు చిరుత పులి ఓ మూలన నక్కింది. సమాచారం తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది తలుపులను మూసివేసి చిరుతపులిని బందీగా చేశాడు. దీంతో రోగులంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుత పులిని బంధించి తీసుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)