బెల్లంపల్లి చైర్‌పర్సన్‌ లో కాంగ్రెస్‌లో చేరిక !

Telugu Lo Computer
0


తెలంగాణాలోని బెల్లంపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత, ఆమె భర్త శ్రీధర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం హైదరాబాద్‌లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ సమక్షంలో చైర్‌పర్సన్‌ దంపతులు, మరికొందరు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరికి వినోద్‌ కండువా కప్పి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుతం ఈ అంశం మున్సిపాల్టీలో సర్వత్రా చర్చనీయాంశమైంది. మా జీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరురాలిగా ఉన్న శ్వేత ఆకస్మికంగా పార్టీ మారడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ వైపు ఎన్నికల్లో ఓడిపోయి గడ్డు పరిస్థితుల్లో ఉండగా కాంగ్రెస్‌ పార్టీ లోకి వరుస చేరికలు మింగుడు పడడం లేదు. ఎన్నికలకు ముందే పలువురు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరగా ప్రస్తుతం చైర్‌పర్సన్‌ కండువా కప్పుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)