ఎమ్మెల్యేగా ప్రమాణం చేయను !

Telugu Lo Computer
0


తెలంగాణలో మూడో సారి ఎన్నికైన  అసెంబ్లీ తొలిసారి సమావేశం కాబోతోంది. శనివారం ఉదయం జరిగే అసెంబ్లీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అంతా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రత్యేక అసెంబ్లీ భేటీకి ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యవహరించబోతున్నారు. అయితే, అసెంబ్లీ తీరుపై భారతీయ జనతా పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడుతున్నారు. అక్బరుద్దీన్ ఒవైసీ ప్రోటెం స్పీకర్ అయితే ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేదీ లేదని తేల్చి చెప్పారు. పూర్తి స్థాయి స్పీకర్ బాధ్యతలు చేపట్టాక ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తానన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)