కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా !

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హవా నడుస్తోంది. ప్రజలు బీఆర్​ఎస్​కు షాకిచ్చి కాంగ్రెస్​ను ఆదరించారు. కొడంగల్​లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి 31,849 ఓట్లతో బీఆర్​ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ ​రెడ్డిపై విజయం సాధించారు. కొడంగల్​లో గెలుపుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ట్వీట్ చేశారు. ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని రేవంత్​రెడ్డి తన ట్వీట్​లో పేర్కొన్నారు. ఈ గడ్డపై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటానని.. దేశానికి కొడంగల్ ను ఒక మోడల్ గా నిలబెడతానని హామీ ఇచ్చారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)