ఎంపీ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా !

Telugu Lo Computer
0


తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా సమర్పించేందుకు పార్లమెంట్ కు వెళ్లారు. అక్కడ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రాజీనామాను సమర్పించారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ స్పీకర్ దగ్గరకు తీసుకుని వెళ్లారు. కాగా.. రేపు అసెంబ్లీలో మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం, ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండటంతో రాత్రికి తిరిగి హైదరాబాద్ రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 

Post a Comment

0Comments

Post a Comment (0)