రాష్ట్రాలకు పన్ను బకాయిల నిధుల విడుదల !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ తో పాటు అన్ని రాష్ట్రాలకూ పన్ను బకాయిల నిధులను  కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. మొత్తంగా 72,961.21 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ కు 2,952.74 తెలంగాణకు 1,533.64 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. రాష్ట్రాలవారీగా అరుణాచల్ ప్రదేశ్- రూ.1,281.93 కోట్లు, అస్సాం- రూ.2,282.24, బీహార్- రూ.7,335.44, ఛత్తీస్‌గఢ్- రూ.2,485.79, గోవా- 281.63, గుజరాత్- రూ.2,537.59, హర్యానా- రూ.797.59, హిమాచల్ ప్రదేశ్- రూ.605.57, జార్ఖండ్- రూ.2,412.83 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయి. కర్ణాటక- రూ. 2,660.88 కోట్లు, కేరళ- రూ.1,404.50, మధ్యప్రదేశ్- రూ. 5,727.44, మహారాష్ట్ర- రూ. 4,608.96, మణిపూర్- రూ.522.41, మేఘాలయా- రూ. 559.61, మిజోరం- రూ.364.80, నాగాలాండ్- రూ.415.15, ఒడిశా- 3,303.69 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. పంజాబ్- రూ. 1,318.40, రాజస్థాన్- రూ. 4,396.64, సిక్కిం- రూ.283.10, తమిళనాడు- రూ.2,976.10, తెలంగాణ- రూ. 1,533.64, త్రిపుర- రూ.516.56, ఉత్తరప్రదేశ్- 13,088.51, ఉత్తరాఖండ్- రూ. 815.71, పశ్చిమ బెంగాల్- 5,488.88 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)