రామ్ చరణ్ కి ఇంటర్నేషనల్ అవార్డు !

Telugu Lo Computer
0


రామ్ చరణ్ ఖాతాలో మరో ఇంటర్నేషనల్ అవార్డ్ వచ్చింది. అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్ ఇండియాలోని బాలీవుడ్ యాక్టర్స్ అండ్ సినిమాలకు కూడా ఇస్తుంటారు. ఇప్పటికే ఈ అవార్డ్స్ నామినేషన్స్‌లో… రామ్ చరణ్, షారుఖ్ ఖాన్, అదా శర్మ, దీపికా పదుకొనే, రాశి ఖన్నా వంటి వారు చోటు దక్కించుకున్నారు. తాజాగా పాప్ గోల్డెన్ అవార్డ్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని పాప్ గోల్డెన్ కమిటీ అధికారికంగా వెల్లడించింది. తెలుగు నుంచి రామ్ చరణ్‌కు పాప్‌ గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు దక్కింది. దీంతో మెగా పవర్ స్టార్ పేరు సోషల్ మీడియా టాప్ ట్రెండ్ అవుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)