21న లిస్ట్ కానున్న ఐనాక్స్ ఐపీవో !

Telugu Lo Computer
0


డిసెంబర్ నెలలో స్టాక్ మార్కెట్ లో ఐపీవోలు క్యూ కట్టాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన ఐపీవోలు భారీ రెస్పాన్స్ అందుకోవడంతో పాటు ఇన్వెస్టర్లకు సిరులు కురిపించడంతో షేర్ హోల్డర్స్ హ్యాపీగా ఉన్నారు. డిసెంబర్ 14 నుంచి మొదలు కాబోతున్న ఐనాక్స్ ఐపీవో  కోసం ఇన్వెస్టర్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఐనాక్స్ ఇండియా లిమిటెడ్ నిధుల సమీకరణ కోసం ఐపీవో ఆఫర్ చేస్తోంది. క్రయోజనిక్ స్టోరేజ్ ట్యాంకుల తయారీ బిజినెస్ లో ఎండ్ టూ ఎండ్ సోల్యూషన్స్ అందించే ఈ కంపెనీ ఐపీవో ద్వారా రూ. 1459.32 కోట్లను సమీకరించాలని ప్లాన్ చేసింది. ఈ మేరకు డిసెంబర్ 14, 2023 నుంచి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ షురూ చేస్తోంది. డిసెంబర్ 18, 2023 వరకు ఈ ఐపీవో అందుబాటులో ఉండనుంది. ఐపీవోలో ఒక్కో ఈక్విటీ షేరు ప్రైస్ బ్యాండ్ రూ. 627 నుంచి రూ. 660గా కంపెనీ నిర్ణయించింది. 22 షేర్లు లాట్ సైజ్ గా పెట్టారు. ఒక్కో లాట్ కి సుమారు రూ. 14,520 పెట్టుబడి పెట్టాలి. ఈ షేర్లు డిసెంబర్ 21న లిస్ట్ కానున్నాయి. 2 రూపాయల ఫేస్ వ్యాల్యూ కలిగిన 2,21,10,955 షేర్లను ఈ ఐపీవో ద్వారా విక్రయించబోతున్నారు. దీని ద్వారా రూ. 1459.32 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా పెట్టుకుంది ఐనాక్స్ కంపెనీ. 

Post a Comment

0Comments

Post a Comment (0)