రేవంత్ రెడ్డి కార్యదర్శిగా షానవాజ్ ఖాసిం !

Telugu Lo Computer
0


తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి కార్యదర్శిగా సీనియర్ ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసింను నియమించారు. ఆయన 2003 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ప్రస్తుతం మల్టీ జోన్ 2 పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పని చేస్తోన్నారు. రేవంత్ రెడ్డి శాంతిభద్రతలపై దృష్టి సారించారు. కీలకమైన హైదరాబాద్, దీనికి ఆనుకుని ఉన్న రెండు కమిషనరేట్లను మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు కొత్త అధిపతులను నియమించారు. మొత్తం అయిదుమంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కొద్దిసేపటి కిందటే జీవో 1632ను విడుదల చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. ప్రస్తుతం ఆయన పోలీస్ విభాగం ఆర్గనైజేషనల్ అండ్ లీగల్ అదనపు పోలీస్ డైరెక్టర్‌గా పని చేస్తోన్నారు. యాంటీ నార్కొటిక్స్ బ్యురో డైరెక్టర్‌గా సందీప్ శాండిల్య బదిలీ అయ్యారు. హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్‌ జీ సుధీర్ బాబుకు స్థానచలనం కలిగింది. ఆయనను రాచకొండ పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేశారు. అక్కడున్న దేవేంద్ర సింగ్ చౌహాన్‌కు  ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. సైబరాబాద్ జాయింట్ కమిషనర్ (అడ్మిన్) అవినాష్ మహంతి బదిలీ అయ్యారు. సైబరాబాద్ కమిషనర్‌గా అపాయింట్ అయ్యారు. ప్రస్తుతం అక్కడున్న స్టీఫెన్ రవీంద్ర బదిలీ అయ్యారు. ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. డీఎస్ చౌహాన్, స్టీఫెన్ రవీంద్రలను డీజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. దీనికి కొనసాగింపుగా మరో జీవోను విడుదల చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)