భక్తులకు టీ పంచిన రాహుల్ గాంధీ !

Telugu Lo Computer
0

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పవిత్ర కేదార్‌నాథ్ ఆలయం వద్ద భక్తులకు టీ పంచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. మూడు రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా ఆదివారం కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా కులగణనపై ప్రధాని మోదీని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు గుప్పించారు. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే రైతులకు మరిన్ని ప్రయోజనాలను అందిస్తామని హామీ ఇచ్చారు. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులను బీజేపీ "ఆదివాసీ" అని కాకుండా "వనవాసీ" అని పిలుస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడానికి బదులు పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)