బిస్కెట్‌ పకోడీ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday 6 November 2023

బిస్కెట్‌ పకోడీ !


సోషల్‌ మీడియాలో వంటల ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు లెక్కలేనన్ని కనిపిస్తాయి. తాజాగా ఒక వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ఒక మహిళ ఉడికించిన బంగాళ దుంపలు, బిస్కెట్లు కలిపి వినూత్న రీతిలో పకోడీలు తయారు చేసింది. ఈ వీడియో చూసిన వారంతా రకరకాల కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వీడియో మొదట్లో ఆ మహిళ పకోడీల తయారీకి వినియోగించే శనగపిండిలో బిస్కెట్లను ముంచడాన్ని గమనించవచ్చు. ఆ తరువాత వాటిని ఆమె వేడి నూనెలో వేయిస్తుంది. అయితే వీడియోలో ఇక్కడే ట్విస్ట్‌ ఉంది. ఆమె ఈ బిస్కెట్‌ పకోడీలను వేయించడానికి ముందు మొదటగా బంగాళాదుంపలను ఉడకబెట్టి మెత్తగా చేస్తుంది. దానికి వేయించిన మసాలా దినుసులు కలుపుతుంది. తరువాత రెండు బిస్కెట్ల మధ్య ఆ బంగాళదుంప మసాలా ముద్దను ఉంచి, వాటిని పకోడీలు చేయడానికి ఉపయోగించే పిండిలో ముంచి, డీప్ ఫ్రై చేస్తుంది. చివరగా ఆమె వాటిని సాస్‌తో కూడిన ప్లేట్‌లో సర్వ్‌చేస్తుంది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో @Shayarcasm అనే ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 20 వేల మందికి పైగా యూజర్లు వీక్షించారు. ఈ 58 సెకన్ల వీడియోపై ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. 

No comments:

Post a Comment