గన్‌తో బెదిరించి మహిళపై లైంగిక దాడి !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని హర్డోయ్ జిల్లాలో భర్త లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన కొందరు వ్యక్తులు ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వీడియో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. ఇది బాధితురాలి దృష్టికి వెళ్లడంతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. గతవారం బంధువులైన ఇద్దరితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు ఒక ఇంట్లోకి చొరబడ్డారు. ఒంటరిగా ఉన్న 30 ఏళ్ల మహిళకు ఒక వ్యక్తి గన్‌ గురిపెట్టాడు. మరో వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇద్దరు వ్యక్తులు దీనిని వీడియో రికార్డ్‌ చేశారు. ఎలక్ట్రిక్‌ ఆటో నడిపే భర్తకు బాధిత భార్య ఈ విషయం చెప్పింది. దీంతో అతడు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కాగా, నిందితులు ఆ వీడియో క్లిప్‌ను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. ఇది బాధితురాలి దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన భర్త ఆమెను కాపాడాడు. తొలుత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి పంపారు. మరోవైపు ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. భూ వివాదం నేపథ్యంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడి వీడియో రికార్డ్‌ చేసినట్లు దర్యాప్తులో తెలిసిందన్నారు. నిందితుల కోసం వెతుకుతున్నామని పోలీస్‌ అధికారి వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)