హైదరాబాద్ - షిర్డీ విమాన ప్యాకేజీ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday 17 November 2023

హైదరాబాద్ - షిర్డీ విమాన ప్యాకేజీ !


షిర్డీకి వెళ్లే భక్తులకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్యాకేజీ ప్రకటించింది. తాజాగా విమాన పర్యాటకాన్ని అందుబాటులోకి తెచ్చింది. రూ 12,499 టికెట్ ధరతో షిర్డీ యాత్రను ప్రారంభించింది. ప్రతీ రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరే ఏసీ బస్సులకు అదనంగా విమాన యాత్రను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ ప్రకటించింది. దీని ద్వారా ఏ విధంగా భక్తులకు సేవలు అందించేదీ సంస్థ వెల్లడించింది. దీని ద్వారా షిర్డీ వెళ్లే భక్తులకు వెసులుబాటు కలగనుంది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రకటించిన ఈ తాజా ప్యాకేజీ ద్వారా హైదారబాద్ లో విమానాశ్రయానికి చేర్చటం షిర్డీలో స్థానికంగా పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లటం తమదే బాధ్యత అని సంస్థ ప్రకటించింది. భోజనం, వసతి కూడా అందులోనే ఉండనుంది. ఈ ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి మధ్నాహ్నం 1.30 గంటలకు బయల్దేరి 2.30 గంటలకు షిర్డీ చేరుకుంటారు. హోటల్ లో బస చేసి సాయంత్రం 4.30 గంటలకు షిర్డీ సాయి దర్శనం ఉంటుంది. సాయంత్రం హారతి కార్యక్రమంలో పాల్గొన్న తరువాత రాత్రి 7 గంటలకు బాబా థీమ్ పార్కులోని సౌండ్ అండ్ లైట్ షోను తిలకించవచ్చు. రాత్రి బస చేసిన తరువాత మరుసటి రోజు ఉదయం 8 గంటలకు పంచముఖి గణపతి మందిర దర్శనం ఉంటుంది. పాత శిర్డీ, ఖండోబా మందిర్, సాయి తీర్ధం దర్శనాల అనంతరం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు విమానంలో బయల్దేరి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇందులో కొన్ని దర్శన టికెట్లు స్వయంగా కొనుక్కోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే షిర్డీకి విమాన సర్వీసుకు పెరుగుతున్న ఆదరణ తో మరింతగా భక్తులకు వెసులుబాటు కలిగేలా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. 

No comments:

Post a Comment