అశోక్‌ గెహ్లోత్‌ ఓ మాయాగాడు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday 21 November 2023

అశోక్‌ గెహ్లోత్‌ ఓ మాయాగాడు !

రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నేపథ్యంలో బరాసన్‌ అంటాలో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ ఓ మాయాగాడు అంటూ ఫైర్‌ అయ్యారు. ఆయన రాష్ట్రంలో తుపాకులకే ఎక్కువ పని చెప్పాడని విమర్శించారు.కాంగ్రెస్‌ ఐదేళ్ల పాలనలో రాజస్తాన్‌లోని ప్రతి భూమి, నీరు, అడవి ఎలా అమ్ముడుపోయాయో అనే వివరాలు ఉన్నాయని, అందుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్‌ తన దగ్గర ఉందన్నారు. ముఖ్యంగా గెహ్లోత్‌ పాలనలో జరిగిన నేరారోపణలకు సంబంధించిన సమాచారం అంతా ఉందన్నారు . అందుకు సంబంధించిన విషయాలు సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌ అవ్వడం గమనార్హం. ఈ సందర్భంగా మోడీ జూలైలో జరిగిన అసెంబ్లీ సమావేశం గురించి గుర్తుకు తెచ్చుకున్నారు. ఆ సమావేశంలో అప్పటి రాష్ట్ర మంత్రి రాజేంద్ర సింగ్ మహిళల భద్రతా అంశాన్ని లెవనెత్తారు. మణిపూర్‌లో మహిళలపై జరిగిన నేరాల విషయమై ఆత్మపరిశీలన చేసుకోవాలని చురకలంటించారు. అంతే ఆ తర్వాత కొన్ని గంటల్లోనే గెహ్లోత్‌ ప్రభుత్వం ఆయన్ను తొలగించిందంటూ చెప్పుకొచ్చారు. అంతేగాదు ఆయన హయాంలో జరిగిన అవినీతి గురించి కూడా ప్రస్తావించారు.కాంగ్రెస్‌ అంటే అవినీతి, రాజవంశం, బుజ్జగింపులకు చిహ్నం అంటూ ఎద్దేవా చేశారు. నిజానికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయ్యింది. ప్రస్తుతం మన ముందు అభివృద్ధి చెందిన భారత్‌గా తీర్చిదిద్దడమేనదే లక్ష్యం, కానీ రాజస్తాన్‌ అభివృద్ధి చెందకుండా అభివృద్ధి చెందిన భారత్‌గా మార్చడమనే లక్ష్యం ఎలా సంపూర్ణమవుతుందని  ప్రశ్నించారు. కాంగ్రెస్‌కి చిహ్నం అయినా ఆ మూడే దేశానికి అతిపెద్ద శత్రువులని, అవి మన మధ్య ఉన్నంతవరకు అభివృద్ధి చెందిన భారత్‌గా ఎలా మార్చగలం అని నిలదీశారు. 

No comments:

Post a Comment