ఢిల్లీలో మరో 83 షాపులు 24 గంటలు ఓపెన్‌కు అనుమతి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday 21 November 2023

ఢిల్లీలో మరో 83 షాపులు 24 గంటలు ఓపెన్‌కు అనుమతి !


ఢిల్లీలో మరో 83 దుకాణాలు, వాణిజ్య సంస్థలకు 24 గంటలు పనిచేయడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనుమతి ఇచ్చారు. దీంతో ఢిల్లీలో 24 గంటలపాటు తెరిచి ఉంచే దుకాణాల సంఖ్య 635కు చేరింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ కమిటీ (ఎస్‌ఈసీ) నిర్ణయం తీసుకుంది. కమిటీకి మొత్తం 122 దరఖాస్తు వచ్చాయి. కానీ సరైన వివరాలు వెల్లడించని కారణంగా 29 దరఖాస్తులను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. నిర్దిష్ట ప్రదేశాల్లోని దుకాణాలను ఎంపిక చేసి అనుమతించినట్లు చెప్పారు. చట్టంలోని నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు 24 గంటలు పనిచేయడంతో నగర ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. దాంతోపాటు మరింత మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా ఈ నిర్ణయం సహకరిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

No comments:

Post a Comment