క్లోరిన్ గ్యాస్ లీక్‌ అయ్యి ఆసుపత్రి పాలైన నర్సింగ్‌ విద్యార్థినులు

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని మధురలో వైద్యాధికారి కార్యాలయం వద్ద ఉంచిన సిలిండర్ల నుంచి క్లోరిన్‌ గ్యాస్ లీక్‌ అయ్యి అక్కడ విధులు నిర్వహించిన నర్సింగ్‌ విద్యార్థినులు అస్వస్థత చెందారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడి చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (సీఎంవో) కార్యాలయంలోని క్యాంపస్‌లో క్లోరిన్‌ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. గురువారం సాయంత్రం ఒక సిలిండర్‌ నుంచి క్లోరిన్ గ్యాస్ లీక్‌ అయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తాత్కాలికంగా దానిని నియంత్రించారు. కాగా, ఆ సిలిండర్‌ నుంచి క్లోరిన్‌ గ్యాస్‌ లీకేజీ ఆగలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం అక్కడ విధుల్లో ఉన్న పది మంది నర్సింగ్‌ విద్యార్థినులు అస్వస్థత చెందారు. దీంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఫైర్‌ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. క్లోరిన్‌ గ్యాస్‌ లీకేజీని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గురువారం సాయంత్రం నుంచి క్లోరిన్ గ్యాస్ లీక్‌ అవుతున్నప్పటికీ అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంపై నర్సింగ్‌ విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నిర్లక్ష్యం వల్ల తాము అనారోగ్యం పాలయ్యామని కొందరు యువతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)