యూట్యూబ్ వీడియోలను లైక్ చేస్తున్నారా ?

Telugu Lo Computer
0


సైబర్ నేరగాళ్లు ఏ సీజన్ ను వదిలిపెట్టడం లేదు. పండుగకు గ్రీటింగ్స్ పంపినట్లుగా వినియోగదారుల వాట్సాప్ మెసేజ్ లు చేస్తున్నారు. ఆ గ్రీటింగ్స్ సులభంగా డబ్బు సంపాదించే ట్రిక్స్ అంటూ కొన్ని లింక్స్ ఇస్తున్నారు. అందులో టాప్ బ్రాండ్ల ప్రమోషనల్ వీడియోల లింక్స్ ఇచ్చి, వాటిని జస్ట్ ఓపెన్ చేస్తే డబ్బులు ఇస్తామంటూ ఎరవేసి బట్టులో వేసుకుంటున్నారు. ఈ తరహా మోసాలు దీపావళి సందర్భంగా కొన్ని చోట్ల వెలుగుచూశాయి. ఈ తరహా మోసాలపై కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలి ఓ వ్యక్తికి ఒక తెలియని నంబర్ నుంచి దీపావళి పండుగ శుభాకాంక్షలతో కూడని మెసేజ్ ఫోన్ కి వచ్చింది. అది పంపిన వ్యక్తి తనను తాను ప్రముఖ కంపెనీ నుంచి హెచ్ఆర్ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు. అతని కంపెనీ యూట్యూబ్ ప్రకటనలపై పని చేస్తుందని, మీకు డబ్బు సంపాదించడంలో సహాయపడే చిన్న టాస్క్ జాబ్‌లను అందజేస్తుందని చెప్పాడు. ఆ వ్యక్తి యూట్యూబ్ వీడియోలను చూడటం, లైక్ చేయడం ద్వారా రోజుకు రూ. 3000 వరకు ఆఫర్ చేస్తున్నట్లు వివరించాడు. దీని కోసం యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న మూడు వీడియో ప్రకటనలను లైక్ చేసి, ఆపై లైక్‌ల స్క్రీన్‌షాట్‌లను పంపాలని కోరాడు. ఆ తర్వాత డబ్బును పంపడానికి వినియోగదారుడి బ్యాంకు డిటైల్స్ షేర్ చేయాలని అడుగుతాడు. ఆ వ్యక్తికి వచ్చిన యూ ట్యూబ్ లింక్ లు సరైనవా కావా అని తెలుసుకునేందుకు ప్రయత్నించగా  ఆ యూ ట్యూబ్ వీడియోలు అన్ని సక్రమమైనవే. అధికారిక యూ ట్యూబ్ చానళ్ల నుంచి వచ్చినవే. అవి ప్రపంచ వ్యాప్తంగా పేరున్న టాప్ కంపెనీలకు సంబంధించినవే. డవ్, సంతూర్ వంటి కంపెనీలకు చెందిన యాడ్స్ అవి. స్కామర్ ఇది సక్రమైనది నమ్మించి, వినియోగదారులను బురిడి కొట్టించేందుకు ఒరిజనల్ యూట్యూబ్ లింకులను వినియోగించాడు. ఈ స్కామ్ ఫిషింగ్ ప్రయత్నం కూడా కాదు. ఫిషింగ్ స్కామ్ అంటే స్కామర్‌లు హానికరమైన లింక్‌లను ఉపయోగించి పరికరాలను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ ఈ స్కామ్‌లలో, ఆన్‌లైన్ మోసగాళ్ళు మొదట్లో శుభాకాంక్షలు, నిజమైన వీడియోలు పంపి వారి నమ్మకాన్ని పొంది, ప్రజలను మోసగిస్తున్నారు. తర్వాత వారు బ్యాంకు వివరాలను పొందడం ద్వారా వారి ప్రణాళికను అమలు చేస్తున్నారు. ముందుగా కొంత డబ్బును పంపుతూ తర్వాత టోకరా వేస్తున్నారు. వినియోగదారుడు డబ్బును ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించిన తర్వాత, స్కామర్‌లు పన్ను, ఇతర చట్టపరమైన సమస్యలతో వారిని బెదిరించి, టాస్క్‌ల నుండి సంపాదించిన నిధులను యాక్సెస్ చేయడానికి ఎక్కువ చెల్లించేలా చేస్తారు. కొన్ని సందర్భాల్లో, స్కామర్‌లు మనీలాండరింగ్ ఆరోపణలతో బాధితుడిని బెదిరించడం వల్ల బాధితులు స్కామర్‌ల ఖాతాలలో ఎక్కువ డబ్బు జమ చేస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)