ఢిల్లీలో అనధికార ఎమర్జెన్సీ ?

Telugu Lo Computer
0


ఢిల్లీలో అనధికార ఎమర్జెన్సీ నడుస్తోంది. కొద్ది రోజులుగా కాలుష్యం ఏమాత్రం తగ్గకపోవడంతో ఢిల్లీ సర్కారు జీఆర్‌ఐపీ-3 నిబంధనలను కఠినతరం చేసింది. మార్నింగ్, ఈవెనింగ్ జాగింగ్‌కు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బాణసంచా కాల్చొద్దని హెచ్చరికలు చేసింది. ఢిల్లీలో ఓ వైపు కాలుష్యం తీవ్ర స్థాయిలో కమ్ముకుంది. పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ వైపు నుంచి భారీగా పొగ వస్తోంది. మరో వైపు చలి వాతావరణంతో నగరంపై పొగ నిలిచిపోయింది. ఇదే సమయంలో దీపావళి కావడంతో కాలుష్యం వీపరీతంగా పెరిగిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. "బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయొద్దు. దోమలను చంపేందుకు కాయిల్స్, అగరబత్తులు కాల్చొద్దు. కలప, ఆకులు, పంట వ్యర్ధాలు దహనం చేయొద్దు. తరచూ కళ్లను నీటితో శుభ్రం చేసుకోవాలి. గోరు వెచ్చని నీటితో పుక్కిలించాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తితే వైద్యులను సంప్రదించాలి." అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)