'ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్' అంటే ఏంటి?

Telugu Lo Computer
0


కసారి వండిన ఆహార పదార్థాన్ని మళ్లీ వేడి చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఫుడ్‌లో శరీరానికి హాని కలిగించే కెమికల్స్ ఫామ్ అవుతాయి. ఇదే విధంగా ఫ్రైడ్ రైస్‌ను వేడి చేసి తినడం వల్ల ఓ వ్యక్తి మరణించాడనే వార్త ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. సదరు వ్యక్తి మరణానికి 'ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్' కారణమని తేలింది. ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ అనేది మొదటిసారిగా 2008లో వెలుగులోకి వచ్చింది. 20 ఏళ్ల ఓ కాలేజీ యువకుడు నూడుల్స్‌ ప్రిపేర్ చేసి తిన్నాడు. మిగిలిన దాన్ని ఫ్రిజ్‌లో పెట్టారు. ఐదు రోజుల తర్వాత మళ్లీ వేడి చేసి ఆ నూడుల్స్ తిన్నాడు. తర్వాత అది పాయిజన్ అయింది. ఈ విషతుల్యమైన ఫ్రైడ్‌రైస్ చివరికి అతని ప్రాణాలను తీసింది. 'ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్' అంటే ఫుడ్ పాయిజన్ అని అర్థం. వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సేపు ఉంచినప్పుడు బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా చేరి ఆహారాన్ని విషతుల్యం చేస్తుంది. ఈ పదార్థాన్ని తింటే జీర్ణాశయ వ్యాధులకు కారణమవుతుంది. అయితే చాలా అరుదుగా మరణం సంభవిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బియ్యం, పాస్తా వంటి పిండి పదార్థాలు ఎక్కువ సమయం నిల్వ ఉంచితే చెడిపోయే అవకాశం ఉంది. వండిన కూరగాయలు, మాంసం వంటకాలు వంటి ఇతర ఆహారాలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది. ఇందులోని బ్యాక్టీరియా ఒక రకమైన కణాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఫుడ్‌ను వేడి చేయడం వల్ల ఇది విషతుల్య రసాయనాలను విడుదల చేస్తుంది. బాసిల్లస్ సెరియస్ బ్యాక్టీరియా ఫామ్ అయిన పదార్థాన్ని తింటే అతిసారం బారిన పడే అవకాశం ఉంది. వాంతులు కావచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ పరిస్థితి నుంచి రెండు రోజుల్లో ఉపశమనం లభిస్తుంది. అయితే చిన్న పిల్లలు, ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నవారిలో రిస్క్‌ను పెంచుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)