వాయుగుండంగా మారిన అల్పపీడనం !

Telugu Lo Computer
0


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ ఉదయం విశాఖకు ఆగ్నేయంగా 510 కిలోమీటర్లు, ఒడిస్సా పారాదీప్‌కు ఆగ్నేయంగా 650 కిలోమీటర్లు, బెంగాల్‌కు దక్షిణంగా 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. మరోవైపు శ్రీలంక తీర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తోంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని.. పోర్టులో మొదటి ప్రమాద హెచ్చరిక లు జారీ చేశారు. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. మరింత బలపడి రేపటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తరువాత దిశ మార్చుకుని ఒరిస్సా వైపు వెళ్లనుందని చెబుతున్నారు ఐఎండీ అధికారులు. ఈరోజు, రేపు కోస్తా తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని మత్స్యకారులెవరు ఆంధ్ర తీరంలో వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద సూచిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)