దీపావళికి ముందే రిలయన్స్ క్రెడిట్ కార్డులు ? - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday 1 November 2023

దీపావళికి ముందే రిలయన్స్ క్రెడిట్ కార్డులు ?


దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పండగ ముందే రిలయన్స్ రిటైల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా క్రెడిట్‌​కార్డులను తీసుకురాబోతుందని తెలుస్తుంది. ఈ క్రమంలో రెండు కోబ్రాండెడ్ రిలయన్స్ ఎస్‌బీఐ కార్డులను విడుదల చేయనుంది. వీటిని 100 శాతం రీసైకిల్ ప్లాస్టిక్‌తో తయారు చేసినట్లు సమాచారం. రెండు దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో వస్తున్న కొత్త క్రెడిట్ కార్డులను రిలయన్స్ ఎస్‌బీఐ కార్డ్, రిలయన్స్ ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్ పేరుతో విడుదల చేస్తున్నారు. రిలయన్స్ రిటైల్ స్టోర్లలో లావాదేవీలపై వినియోగదారులకు ప్రత్యేక ప్రయోజనాలు, ఆఫర్‌లను అందించనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్, ఫార్మా, కిరాణా వస్తువులపై ఆఫర్లు పొందనున్నట్లు తెలుస్తుంది. ఈ కార్డ్ వార్షిక రుసుం రూ.499. ఏడాదిలో కార్డు ద్వారా రూ.1,00,000 ఖర్చు చేసిన వినియోగదారులకు వార్షిక రుసుం మినహాయింపు ఉంటుంది. ఇంధనం, ఇంటి అద్దె, వాలెట్ అప్‌లోడ్ మినహా ఇతర కొనుగోళ్లపై ఖర్చు చేసే ప్రతి రూ.100కి ఒక రివార్డు పాయింట్ అందించబడుతుంది. జాయినింగ్ ఫీజు చెల్లింపుపై రూ.500 విలువైన రిలయన్స్ రిటైల్ వోచర్ కార్డు పొందుతారు. రిలయన్స్ రిటైల్ స్టోర్లలో, డైనింగ్, సినిమాలపై ఖర్చు చేసిన చెల్లింపులపై ప్రతి రూ.100కి 5 రివార్డు పాయింట్లు అందించబడతాయి. వివిధ రిలయన్స్ రిటైల్ స్టోర్‌ల నుంచి రూ.3,200 విలువైన అదనపు తగ్గింపు వోచర్‌లు అందించబడుతున్నాయి. అన్ని పెట్రోల్ పంపుల్లో 1% ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపును కార్డు అందిస్తోంది. రిలయన్స్‌ ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్  కార్డ్ వార్షిక రుసుం రూ.2,999. రూ.3,00,000 వార్షిక ఖర్చు చేసిన వారికి వార్షిక రుసుం మినహాయింపు ఉంటుంది. కార్డు హోల్డర్లు రిలయన్స్ రిటైల్ స్టోర్లలో చేసే కార్డు కొనుగోళ్లపై ప్రతి రూ.100కి 10 రివార్డు పాయింట్లను అందుకుంటారు. డైనింగ్, సినిమాలు, దేశీయ విమానయాన సంస్థలు, అంతర్జాతీయ వ్యయంపై ఖర్చు చేసిన రూ.100 ఖర్చుకు 5 రివార్డ్ పాయింట్లు అందించబడతాయి. ఇంధనం, ఇంటి అద్దె, వాలెట్ అప్‌లోడ్ మినహా.. ఇతర రిటైల్ కొనుగోళ్లపై రూ.100 ఖర్చుకు 2 రివార్డ్ పాయింట్లు అందించబడతాయి. జాయినింగ్ ఫీజు చెల్లింపుపై కార్డు హోల్డర్లు రూ.3,000 విలువైన రిలయన్స్ రిటైల్ వోచర్ అందుకుంటారు. అన్ని పెట్రోల్ పంపుల్లో 1% ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు ఉంటుంది. బుక్‌మైషోలో ప్రతి నెలా రూ.250 విలువైన 1 సినిమా టిక్కెట్ కార్డు అందిస్తున్నారు.

No comments:

Post a Comment