హామీని నిలబెట్టుకోలేదని కాంగ్రెస్‌పై అఖిలేష్ యాదవ్ విమర్శలు

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి ఆరు సీట్లు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్, ఆ మేరకు హామీని నిలబెట్టుకోలేదని అఖిలేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంతో ఎస్పీ, కాంగ్రెస్ మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి. ఆయన ఎక్స్(ట్విట్టర్)లో పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. ఎస్పీ కార్యకర్త ఫోటోను పోస్ట్ చేస్తూ.. ''మిషన్ 2024 నేతాజా (ములాయం సింగ్ యాదవ్) అజరామరంగా ఉండనివ్వండి. 'పీడీఏ' ఈసారి ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ ని గెలిపించేలా చేస్తుంది. అఖిలేష్ యాదవ్ పేదలకు న్యాయం జరిగేలా చూస్తారు'' అంటూ ట్వీట్ చేశారు. పీడీఏ అంటే వెనకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలు అని అర్థం. మధ్యప్రదేశ్ ఎన్నికల అభ్యర్థుల లిస్టును కాంగ్రెస్ ప్రకటించిన తర్వాత ఇతర పార్టీలను కాంగ్రెస్ ఫూల్ చేస్తోందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. రాష్ట్రంలో పొత్తులేదని తెలిస్తే మేం కాంగ్రెస్ వాళ్లతో కలిసేవాళ్లం కాదని ఆయన అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ మాట్లాడుతూ.. అఖిలేష్ యాదవ్ ఈ వివాదాన్ని వదిలేయాలని కోరారు. ఇండియా కూటమి కేంద్ర స్థాయిలో ఉందని అన్నారు. కాంగ్రెస్, ఎస్పీకి ద్రోహం చేయవద్దని, పొత్తు కావాలా..? వద్దా..? అనేది స్పష్టం చేయాలని కోరింది. గతంలో కులగణన లెక్కలు చెప్పని ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కులగణనపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని అఖిలేష్ యాదవ్ అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)