చిప్లూన్ నగరంలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday 16 October 2023

చిప్లూన్ నగరంలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ !

హారాష్ట్రలోని రత్నగిరి జిల్లా చిప్లూన్ నగరంలో మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో నిర్మాణంలో ఫ్లైఓవర్ కుప్పకూలింది. దీంతో అక్కడున్న వారందరూ ఉలిక్కి పడ్డారు. పాదాచారులు భయంతో పరుగులు తీశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. క్రేన్ మెషీన్ దెబ్బతినడంతోపాటు భారీ ధూళి మేఘాలు ఎగసిపడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. చిప్లూన్‌లో ముంబై - గోవా నాలుగు లేన్ల హైవేలో నిర్మాణంలో ఫ్లైఓవర్ స్తంభం కుప్పకూలింది. వెంటనే, ఫ్లైఓవర్ ఒక భాగం కూడా కూలిపోయింది. సైట్లో ఉపయోగిస్తున్న క్రేన్ యంత్రం దెబ్బతింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు లేదా ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

No comments:

Post a Comment