నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన జస్టిన్ ట్రూడో ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday 16 October 2023

నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన జస్టిన్ ట్రూడో !


కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్టోబర్ 15వ తేదీన హిందూ సమాజానికి నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ''నవరాత్రి సందర్భంగా 9 రాత్రులు, 10 రోజుల పగటి సమయాల్లో కెనడాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజ సభ్యులు ఘనంగా వేడుకలు జరుపుకుంటారు. నవరాత్రి అనేది హిందువుల విశ్వాసంలో అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన పండుగల్లో ఒకటి. రాక్షసుడు మహిషాసురునిపై దుర్గా దేవత సాధించిన విజయాన్ని, అలాగే చెడుపై మంచి సాధించే గెలుపుని జ్ఞాపకంగా ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఇది తరచుగా స్త్రీ శక్తి వేడుకగా కనిపిస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి.. ప్రార్థనలు, సంతోషకరమైన ప్రదర్శనలు, ప్రత్యేక భోజనాలు, బాణసంచాతో శతాబ్దాల నాటి సంప్రదాయాలను గౌరవించే సమయం ఇది'' అంటూ జస్టిన్ ట్రూడో చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఒట్టావా ఒక ప్రకటనను విడుదల చేసింది. అంతేకాదు ఈ నవరాత్రి వేడుకలు హిందూ సమాజపు గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకోవడానికి మంచి అవకాశాన్ని అందిస్తుందని జస్టిన్ ట్రూడో తెలిపారు. ఈ సంవత్సరం నవరాత్రి వేడుకలు జరుపుకుంటున్న ప్రతిఒక్కరికీ తన కుటుంబం, కెనడా ప్రభుత్వం తరఫున తాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. అయితే.. తన ప్రకటనలో ట్రూడో ఎక్కడా భారత్ ప్రస్తావన తీసుకురాలేదు కానీ, ఈ వేడుకలు మాత్రం కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగిన భారతదేశానికి చెందినది. ప్రస్తుతం భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో.. ట్రూడో చెప్పిన ఈ శుభాకాంక్షలు ఆ వివాదానికి శుభంకార్డు పడే దిశగా సూచిస్తుందని ఆశించొచ్చు.

No comments:

Post a Comment