తమలపాకులు - ఆరోగ్య ప్రయోజనాలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 29 October 2023

తమలపాకులు - ఆరోగ్య ప్రయోజనాలు !

యుర్వేదంలో బరువు తగ్గడానికి తమలపాకులను ప్రయోజనకరంగా భావిస్తారు. అంతే కాదు ఎనిమిది వారాల్లోనే ప్రభావం కనిపిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తమలపాకులోని పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. సరైన జీవక్రియను నిర్వహిస్తుంది. ఎసిడిటీ వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. తమలపాకులను తీసుకోవడం వల్ల చాలా వరకు కొవ్వులు కరిగి బరువు తగ్గడం సులభం అవుతుంది. అలాగే ఆయుర్వేదంలో, తమలపాకులను శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయకరంగా భావిస్తారు. అరుగుదలకు తమలపాకు బాగా సహకరిస్తుంది. ఇందులో ఉన్న యాంటీ-ఆక్సిడెంట్స్ వల్ల వీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే మలబద్ధకానికి విరుగుడుగా పనిచేస్తుంది. అయితే ఇవే కాకుండా అధిక వరువును తగ్గించడానికి దివ్య ఔషదంలా పనిచేస్తోంది.తమలపాకులు కడుపు ఉబ్బరం లక్షణాలు, జీర్ణక్రియ చికిత్సలో సహాయపడతాయి. ఎలాంటి కసరత్తులు చేయకుండా కొవ్వుని తగ్గించవచ్చు. పచ్చి తమలపాకు తీసుకుని అందులో ఐదు మిరియాలు వేసి పాన్‌ కట్టుకోండి. అలా తయారు చేసిన పాన్‌ ఎక్కువ సేపు నోటిలో పెట్టుకోండి..మీరు సాధారణ పాన్ తింటున్నట్టుగానే..అలా నోటిలో ఏర్పడిన లాలాజలం కడుపులోకి వెళ్లనివ్వండి. ఎనిమిది వారాల పాటు ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత పరగడుపున ఇలా మిరియాలతో తమలపాకులను తినటం వల్ల అద్భుతమైన ఫలితాలు గమనిస్తారు.. ఆయుర్వేదంలో ఈ పద్ధతి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపులోని విషాన్ని తొలగిస్తుంది. ఈ పద్ధతిని ఉపయోగించి కేవలం పచ్చి తమలపాకులను మాత్రమే తినండి.. ఎందుకంటే వాటిలో ఈ ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. పండిన లేదంటే ఎండిపోయిన తమలపాకులను ఈ పద్ధతిలో తీసుకుంటే, మీరు కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, మీరు ప్రతిరోజూ మిరియాలతో పాటు తమలపాకులను తింటే, ఎనిమిది వారాల తర్వాత మీ బరువులో మార్పు కనిపిస్తుంది.

No comments:

Post a Comment