కోచింగ్ అవసరం లేకుండా చర్యలు తీసుకుంటాం !

Telugu Lo Computer
0


దేశంలోనే కోచింగ్‌ హబ్‌గా గుర్తింపు పొందిన రాజస్తాన్‌లోని కోటాలో ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధకరం. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కోచింగ్ అవసరం లేకుండా చర్యలు తీసుకుంటాం. కోటా విద్యార్థుల ఆత్మహత్యలు చాలా సున్నితమైన సమస్య. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చూడటం మన బాధ్యతని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. విదేశీ యూనివర్సిటీలు మనదేశంలో క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలను త్వరలో వెల్లడిస్తామని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ డిమాండ్‌లను తీర్చడానికి సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో సంస్కరణలో తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)