రిజిస్ట్రార్ ఆఫీసులో దివ్యాంగురాలికి చేదు అనుభవం !

Telugu Lo Computer
0


ముంబయి ఖార్‌లోని రిజిస్ట్రార్ ఆఫీసులో రీసెంట్‌గా తన వివాహం చేసుకోవడానికి దివ్యాంగుల హక్కుల కార్యకర్త, మోడల్ విరాలీ మోడీ వచ్చారు. అక్కడ ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసారు. దివ్యాంగులు వెళ్లేందుకు వీలు లేకుండా కార్యాలయం రెండవ అంతస్తులో ఉందని, లిఫ్ట్ కూడా అందుబాటులో లేకపోవడంతో తనను రెండవ అంతస్తులోకి తీసుకువెళ్లాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు. మెట్లు నిటారుగా ఉండటం, రైలింగ్ వదులుగా ఉండటంతో పాటు తుప్పు పట్టి ఉన్నాయని తనకు సాయం చేయడానికి కార్యాలయంలో ఎవరూ ముందుకు రాలేదని విరాలీ మోడీ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. విరాలీ ట్వీట్ వైరల్ కావడంతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ముందుగా విరాలీ మోడీ దంపతులకు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఈ విషయంలో తను వ్యక్తిగతంగా కలగజేసుకుని తగిన చర్యలు తీసుకుంటామని' వెల్లడించారు. నెటిజన్లు సైతం దివ్యాంగుల సౌకర్యాలకు, వారికి అందాల్సిన సేవలను హైలైట్ చేస్తూ కామెంట్లు పెట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)