ఇంధనం కొరతతో విమానాలు నిలిపి వేసిన పాకిస్తాన్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday 18 October 2023

ఇంధనం కొరతతో విమానాలు నిలిపి వేసిన పాకిస్తాన్ !


పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో జనాన్ని తిండి కూడా దొరకని పరిస్థితి.లీటర్ పెట్రోల్ 350 రూపాయలు, కిలో బియ్యం వంద రూపాయలు.. ఇలా ధరలు అన్నీ ఆకాశాన్ని అంటాయి. విదేశీ మారక నిల్వలు తగ్గిపోవటంతో చివరకు విమానాలను కూడా నిలిపివేసింది. విమానాలకు అవసరం అయిన వైట్ పెట్రోల్ కొనుగోలుకు డబ్బులు లేక 48 ఇంటర్నేషనల్ సర్వీసులను రద్దు చేసింది. అక్టోబర్ 18కి షెడ్యూల్ చేసిన 16 అంతర్జాతీయ, 8 దేశీయ విమానాలు పీఎస్ఓ నుంచి ఇంధన సరఫరా కారణంగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో క్యాన్సిల్ చేసిన విమానాల ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానాలకు మార్చారు. ఈ నిర్ణయాన్ని అనుసరించి వారి విమానానికి సంబంధించిన వివరాల కోసం పీఐఏ కస్టమర్ కేర్, పీఐఏ కార్యాలయాలు లేదా వారి ట్రావెల్ ఏజెంట్‌ను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని పాకిస్తాన్ స్టేట్ ఆయిల్  చెల్లించని బకాయిల కారణంగా సరఫరాను నిలిచిపోయింది. దీని వల్ల పీఐఏ విమానాలకు ఇంధన కొరత ఏర్పడింది. పేరుకుపోయిన అప్పుల కారణంగా ఇప్పటికే పతనం అంచున, ప్రైవేటీకరణ దిశగా పయనిస్తున్న విమానయాన సంస్థ భవిష్యత్తు అస్పష్టంగానే ఉంది. నిర్వహణ ఖర్చులను జాతీయ విమానయాన సంస్థ కోరినప్పటికీ, వాటికి మద్దతుగా రూ. 23 బిలియన్లను అందించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం నిరాకరించడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. పీఐఏకి పీఎస్ఓ నుంచి ఇంధనం కోసం రోజుకు రూ. 100 మిలియన్లు అవసరమవుతాయి. అయితే ముందస్తు నగదు చెల్లింపులను మాత్రమే డిమాండ్ చేయడంతో, ఎయిర్‌లైన్ ఈ అవసరాన్ని తీర్చలేకపోయింది. ఇది భవిష్యత్తులో మరిన్ని విమాన రద్దులకు దారి తీస్తుందని పలువురు భావిస్తున్నారు. రాజకీయ అస్థిరతతో పాటుగా పాకిస్తాన్ తన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న క్రమంలో ఈ తాజా పరిణామం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 21.3 శాతానికి చేరుకుంది. గత ఏడాది కాలంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి విలువ దాదాపు సగం పడిపోయింది. దేశం విదేశీ మారక ద్రవ్య నిల్వలు దాదాపు 10 బిలియన్ డాలర్ల వద్ద అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నాయి.

No comments:

Post a Comment