ఆరెస్సెస్ అంటే రాష్ట్రీయ సర్వనాశ్ సమితి

Telugu Lo Computer
0


రెస్సెస్‌పై సీపీఎం సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ దేశంలో అన్ని వర్గాలు, అన్ని మతాలను గౌరవించే మతం హిందూ మతమేనని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ఆరెస్సెస్‌ను ఆమె రాష్ట్రీయ సర్వనాశ్ సమితిగా అభివర్ణించారు. భారత్‌లో వేళ్లూనుకున్న మిశ్రమ సంస్కృతి విలువలు, సిద్ధాంతాలపై ఆరెస్సెస్ దాడికి తెగబడిందని ఆరోపించారు. ఆరెస్సెస్, సంఘ్ పరివార్ ప్రతిరోజూ ప్రజలను, ఇతర మతాలను వేధింపులకు గురిచేస్తోందని దుయ్యబట్టారు. ఆరెస్సెస్ నేతలు విద్వేష ప్రసంగాలు చేస్తూ ప్రతిరోజూ ప్రజలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు.ఆరెస్సెస్‌కు విలువలు, సిద్ధాంతాల పట్ల విశ్వాసం ఉంటే ఇతర మతాలకు చెందిన ప్రజలపై ఆరెస్సెస్ నేతలు ఎందుకు దాడులు చేస్తున్నారో మోహన్ భగతవ్ చెప్పాలని బృందా కారత్ నిలదీశారు. కాగా ఇజ్రాయెల్‌, హమాస్ యుద్ధాన్ని, భారత్‌లో హిందూయిజంతో మోహన్ భగవత్ పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు హాట్ డిబేట్‌కు తెరలేపాయి. హిందూయిజం అన్ని వర్గాలను గౌరవిస్తుందని, అందుకే ఇజ్రాయెల్ తరహాలో భారత్‌లో అలాంటి వివాదానికి తావు లేదని చెప్పారు. భారత్ హిందువులతో కూడిన దేశమని, అయితే ఇతర మతాలను తాము తిరస్కరిస్తామని దాని అర్ధం కాదని ఆయన పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)