జీ20 సమ్మిట్‌ను పోలిన దుర్గాదేవి మండపం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 22 October 2023

జీ20 సమ్మిట్‌ను పోలిన దుర్గాదేవి మండపం !

బీహార్‌ రాజధాని పాట్నాలో భారత్‌లో ఇటీవల జరిగిన జీ20 సమ్మిట్‌ను పోలినట్లుగా దుర్గా మాతా మండపాన్ని రూపొందించారు. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సహా ఇతర దేశాల అధ్యక్షులు పాల్గొన్నట్లుగా దీనిని తీర్చిదిద్దారు. ఎంతో ఆకట్టుకుంటున్న ఈ మండపాన్ని చూసేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. దసరా శరన్నవరాత్రుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విభిన్నంగా దుర్గా మాతా పూజా మండపాలను ఏర్పాటు చేస్తుంటారు. జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యమిచ్చిన ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం తరహాలో దీనిని తీర్చిదిద్దారు. ప్రధాని మోడీతో సహా సమ్మిట్‌కు హాజరైన ప్రపంచ దేశాల అగ్ర నాయకుల బొమ్మలను కూడా ప్రదర్శించారు. కాగా, జీ20 సమ్మిట్‌ నమానాతో ఏర్పాటు చేసిన ఈ దుర్గా పూజా మండపం ఎంతో ఆకట్టుకుంటున్నది. దీనిని చూసేందుకు పలువురు నేతలతోపాటు సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఢిల్లీలోని ప్రముఖ ప్రదేశమైన ఎర్రకోట నమూనాను కూడా ఏర్పాటు చేసిన ఈ మండపం వద్ద ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు.

No comments:

Post a Comment