సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లతో రతన్‌ టాటా టాప్‌ !

Telugu Lo Computer
0


భారతీయ సోషల్ మీడియాలో 360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 జాబితాలో రతన్‌ టాటా టాప్‌ ప్లేస్‌ నిలిచారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం మైక్రోబ్లాగింగ్‌ సైట్‌లో ఎక్స్‌ (ట్విటర్) ఎక్కువ మంది ఫాలోవర్లతో వార్తల్లో నిలిచారు. 12.6 మిలియన్లతో భారతీయ సోషల్ మీడియాలో అత్యంత విస్తృతంగా అనుసరించే వ్యవస్థాపకుడిగా గుర్తింపు పొందారు. ఒక ఏడాదిలో ఆయన ఫాలోవర్లు సంఖ్య 8 లక్షలకు పైగా పెరిగారు. ఆ తరువాతి స్థానంలో 10.8 మిలియన్ల మంది ఫాలోవర్లతో ఆనంద్ మహీంద్రా నిలిచారు. ఈ జాబితాలో టాప్‌ టెన్‌లో పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ, గూగుల్‌ అల్ఫాబెట్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌, మైక్రోసాఫ్ట్‌ కో-ఫౌండర్‌ సత్య నాదెళ్ల, వ్యాపార వేత్తలు నందన్‌ నీలేకని, రోణీ స్క్రూవాలా, హర్ష వర్థన్‌ గోయింగా, కిరణ్‌ మజుందార్‌ షా, ఉదయకోటక్‌ నిలిచారు. దీంతో పాటు, భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల 12వ వార్షిక లిస్ట్‌ను కూడా హురున్‌ వెల్లడించింది. వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కారణంగా సంపదలో గణనీయమైన క్షీణతను ఎదుర్కొన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని అధిగమించి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ టాప్‌లోకి దూసుకొచ్చారు. గౌతమ్ అదానీ సెకండ్‌ ప్లేస్‌లో ఉన్నారు. అంబానీ సంపద ఈ కాలంలో భారీగా పుంజుకుని దాదాపు రూ.8,08,700 కోట్లకు చేరింది. గౌతమ్ అదానీ రూ.474,800 కోట్ల సంపదతో రెండో స్థానానికి పడిపోయారు. సీరం ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ ఎస్ పూనావల్లా రూ. 2,78,500 కోట్ల మొత్తం సంపదతో మూడో స్థానంలోఉన్నారు.ఈ జాబితాలో రూ.2,28,900 కోట్ల సంపదతో శివ నాడార్ నాల్గవ స్థానంలో ఉన్నారు, గోపీచంద్ హిందూజా , అతని కుటుంబం రూ.1,76,500 కోట్లతో 5వ స్థానంలో ఉన్నారు. 1,64,300 కోట్ల సంపదతో దిలీప్ షాంఘ్వీ ఆరో స్థానంలో ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)