పూజారిని కొట్టి కిడ్నాప్‌ చేసేందుకు యత్నం ?

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో  వికాస్ నగర్ సెక్టార్ 9లోని మహాదేవ్ హనుమాన్ ఆలయంలోకి కొందరు వ్యక్తులు ప్రవేశించారు. పూజారి రామ్‌సేన్‌హీ దాస్‌పై భౌతికంగా దాడి చేశారు. ఆయన కాళ్లు, చేతులు పట్టుకుని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. గుడి బయట పార్క్ చేసిన కారులోకి ఎక్కించి కిడ్నాప్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. అయితే జనం గుమిగూడటంతో ఆ వ్యక్తులు పూజారిని వదిలి అక్కడి నుంచి పారిపోయారు. ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు. ఆ గుడికి సంరక్షకుడిగా ఉన్న పూజారి రామ్‌సేన్‌హీ దాస్‌ ఆలయ ప్రాంగణంలో గోడ నిర్మిస్తున్నట్లు తెలిపారు. స్థానికులు దీనిని వ్యతిరేకించడంతో ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొన్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో జరిగిన ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)