మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని తరిమికొట్టండి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday 23 October 2023

మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని తరిమికొట్టండి !


మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారత సైన్యాన్ని దేశం నుంచి తరిమికొట్టాలని తరుచూ అంటున్నారు. అయితే రానున్న కొద్ది రోజుల్లో ఈ విషయాన్ని పెద్ద తతంగమే చేయనున్నట్లు ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు. అధ్యక్షుడు మహ్మద్ ముయిజు భారత్ కంటే చైనాతో సన్నిహితంగా ఉండటం వల్లే ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలో తిరుగుబాటును అణచివేసేందుకు భారత సైన్యం సహాయం కోరి, ఇప్పుడు అదే సైన్యాన్ని వెల్లగొట్టాలని చూస్తున్నారు.  వ్యూహాత్మక దృక్కోణంలో భారతదేశానికి మాల్దీవులు చాలా ముఖ్యమైనది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిన్న దేశంతో సంబంధాలు చెడగొట్టుకోవాలని భారత్ కోరుకోదు. 1988లో తిరుగుబాటుకు వ్యతిరేకంగా అప్పటి అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్ భారతదేశం నుంచి సైనిక సహాయం కోరారు. అప్పుడు భారత ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే సహాయం చేసింది. నవంబర్ 1988లో, మాల్దీవులు అంతర్గత కలహాల్లో మునిగిపోయింది. అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్‌పై మాల్దీవులు వ్యాపారవేత్త అబ్దుల్లా లూథూఫీ, ఆయన సహచరుడు సిక్కా అహ్మద్ ఇస్మాయిల్ మానిక్ తిరుగుబాటుకు కుట్ర పన్నారు. అయితే ఆ కొద్ది రోజుల్లో అబ్దుల్ గయూమ్ భారతదేశాన్ని సందర్శించాలి. కానీ దానికి ముందే అక్కడ తిరుగుబాటు జరిగింది. శ్రీలంక తీవ్రవాద సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈలం కిరాయి సైనికుల సహాయంతో అబ్దుల్లా లుథూఫీ, సిక్కా అహ్మద్ ఇస్మాయిల్ మానిక్ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నారు. అయితే, అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్ దాడిని సకాలంలో గ్రహించి సురక్షితమైన ఇంట్లో దాక్కున్నారు. అక్కడి నుంచి నేరుగా ఇండియాకు ఫోన్ చేసి తన భద్రత కోసం సాయం చేయమని కోరారు. అప్పుడు దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ ఉన్నారు. మౌమూన్ అబ్దుల్ గయూమ్ మాటలను సీరియస్‌గా తీసుకున్న రాజీవ్ ప్రభుత్వం  కొద్ది గంటల్లోనే భారత సైన్యంలోని ఒక బృందాన్ని హుల్‌హులే విమానాశ్రయానికి తరలించారు. ఇక్కడి నుంచి భారత సైనికులు అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్ దాక్కున్న గృహానికి చేరుకుని తిరుగుబాటుదారుల నుంచి ఆయనను కాపాడారు. ఈ ఘటన అనంతరం భారతదేశం, మాల్దీవుల మధ్య సంబంధాలు బాగా పెరిగాయి. అయితే, అధ్యక్షుడు మహ్మద్ ముయిజు ఈ సంబంధాన్ని మెరుగుపరచడానికి బదులు మరింత దిగజారుతున్నారు. ప్రస్తుతం మాల్దీవుల్లో 75 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. ఈ సైనికులు హిందూ మహాసముద్రాన్ని పర్యవేక్షించే కొన్ని నిఘా విమానాలను కలిగి ఉన్నారు. దీనితో పాటు, మాల్దీవులలో సహాయక చర్యలు, వైద్య సహాయం అందించడంలో కూడా పనిచేస్తున్నారు. కొంత కాలం క్రితం భారతీయ నావికాదళం 200 చిన్న దీవుల నుంచి రోగులను ఆసుపత్రికి తరలించడానికి ఉపయోగించే డోర్నియర్ విమానాలలో ఒకటి, రెండు హెలికాప్టర్‌లను ఇక్కడ మోహరించింది.

No comments:

Post a Comment