ఒకే కాన్పులో నలుగురు పిల్లలు !

Telugu Lo Computer
0

మ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కేరాన్ గ్రామానికి చెందిన కలీదా బేగం గర్భిణి. ఈమెకు ఆదివారం సాయంత్రం నొప్పులు రావడంతో స్థానిక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు తీసుకువెళ్లారు. అయితే, అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు, కాన్పు ఇక్కడ చేయడం సాధ్యం కాదని,  వెంటనే కుప్వారా జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని కలీదా కుటుంబ సభ్యులకు ఆసుప్రతి సిబ్బంది సూచించారు. సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కుప్వారా జిల్లా ఆస్పత్రిలో కలీదా సాధారణ ప్రసవం ద్వారా నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. ముగ్గురు మగ శిశువులు కాగా, ఒక ఒక ఆడ శిశువు జన్మించారు. అయితే, ఆ శిశువులందరూ తక్కువ బరువుతో జన్మించారని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అయితే అందులో ముగ్గురు పిల్లలు కుప్వారా ఆస్పత్రిలోనే మరణించారు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం తల్లీ, మరొక శిశువును శ్రీనగర్ ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అక్కడికి వెళ్లాక మరో శిశువు కూడా చనిపోయాడు. ఇలా గంటల వ్యవధిలోనే నలుగురు శిశువులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ తల్లికి తీరని శోకం మిగిలింది. ఈ సంఘటనతో కుటుంబసభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రస్తుతం కలీదా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే, నెలలు నిండకుండా, తక్కువ బరువుతో జన్మించిన పిల్లలను రక్షించేందుకు అవసరమైన సదుపాయాలు కుప్వారా ఉప-జిల్లా ఆసుపత్రిలో అందుబాటులో లేవని కలీదా కుటుంబసభ్యులు అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)