తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం !

Telugu Lo Computer
0


సారి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఇవాళ ఎన్టీఆర్​ భవన్​లో ప్రకటించారు. ఈ ప్రకటన చేస్తూ కాసాని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయంతో కార్యకర్తలు నుంచి నిరసన జ్వాలలు రేకెత్తాయి. అధిష్ఠానం నిర్ణయంతో కాసాని జ్ఞానేశ్వర్‌ కన్నీటి పర్యంతమయ్యారు. రాజమండ్రి కారాగారంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్.. పార్టీ అధినేత చంద్రబాబుతో శనివారం ములాఖత్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్​లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టి పెట్టలేమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ పరిస్థితుల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుందో నేతలకు వివరించాలని కాసానికి సూచించారు. చంద్రబాబు నిర్ణయాన్ని టీడీపీ సీనియర్ నేతలు తెలంగాణ నేతలకు వివరించారు. ఇదే విషయంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కాట్రగడ్డ ప్రసూన, జీవీజీ నాయుడు, సాయిబాబా సహా పలువురు నేతలు, జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధిష్టానం నిర్ణయం పట్ల పార్టీ నేతలు నిరసన తెలిపారు. పార్టీ కోసం అనుక్షణం కష్టపడింది ఎన్నికల కోసమే అని.. ఇప్పుడు తప్పుకోమనడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేయవద్దని లోకేశ్ చెప్పారన్నారు. మరోమారు కార్యకర్తల అభిప్రాయాన్ని బాబు దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)