రోజుకు రూ. 200 కోట్ల లాభం ఆర్జించిన మహదేవ్ యాప్ !

Telugu Lo Computer
0


హదేవ్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించి గత నెలలో ఈడీ 39 ప్రదేశాలలో చేపట్టిన దాడుల్లో గోల్డ్ బార్స్‌, జ్యూవెలరీ, రూ. 417 కోట్ల నగదు పట్టుబడటం కలకలం రేపింది. ఈ యాప్‌ను ప్రమోట్ చేస్తూ యాడ్స్‌లో కనిపించిన బాలీవుడ్ స్టార్స్ రణ్‌బీర్ కపూర్‌, శ్రద్ధా కపూర్‌లకు ఇటీవల ఈడీ సమన్లు జారీ చేయడంతో మహదేవ్ యాప్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో యాప్ ప్రమోటర్ దుబాయ్‌లో రూ. 200 కోట్లు వెచ్చించి ఆర్భాటంగా వివాహ వేడుక నిర్వహించడంతో ఈ యాప్ కార్యకలాపాలపై దర్యాప్తు సంస్ధలు దృష్టి సారించాయి. ఈ అమౌంట్ మొత్తం నగదు రూపంలోనే చెల్లించడంతో ఈడీ ఆ గుట్టుమట్లను ఆరా తీసింది. మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌ను సౌరభ్ చంద్రార్కర్‌, రవి ఉప్పల్ దుబాయ్ నుంచి నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ చత్తీస్‌ఘఢ్‌లోని భిలాయ్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ కంపెనీ తరచూ న్యూ వెబ్‌సైట్స్ క్రియేట్ చేయడం, చాట్ యాప్స్‌లో గ్రూప్స్ ద్వారా కొత్త కస్టమర్లను కంపెనీ ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియా యాప్స్‌లో పెయిడ్ అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారానూ కస్టమర్లను కంపెనీ సమీకరిస్తుంది. వాట్సాప్ ద్వారా యూజర్ల నెంబర్లను కంపెనీ ప్రతినిధులు సంప్రదించి వారిని బెట్టింగ్ ఉచ్చులోకి లాగుతారని ఈడీ వెల్లడించింది. డబ్బు సేకరించి, చెల్లింపులు చేపట్టేందుకు వాడే ఖాతాలన్నీ తప్పుడు పద్ధతిలో తెరిచిన బినామీ ఖాతాలేనని దర్యాప్తు సంస్ధ పేర్కొంది. అన్ని గేమ్స్‌, బెట్స్‌ను కంపెనీ డబ్బు నష్టపోకుండా మహదేవ్ యాప్ రన్ చేస్తుంది. తొలుత లాభపడిన న్యూ యూజర్లు ఆపై అధిక లాభాల కోసం పెద్ద మొత్తంలో డబ్బును సమీకరించి బెట్స్‌, గేమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే దీర్ఘకాలంలో వీరంతా భారీగా నష్టపోతారు. భారత్‌, మలేషియా, థాయ్‌ల్యాండ్‌, యూఏఈలో వందలాది కాల్ సెంటర్స్‌ను ఏర్పాటు చేసిన కంపెనీ రోజుకు వేలాది కోట్ల లావాదేవీలు నిర్వహిస్తుంది. బెట్టింగ్, గేమ్స్ లావాదేవీలతో కంపెనీ రోజుకు రూ. 200 కోట్ల లాభాలను ఆర్జిస్తుందని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)