స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ వేళల్లో మార్పులు ?

Telugu Lo Computer
0


భారత స్టాక్ మార్కెట్లను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో అనేక కీలక మార్పులకు మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం దేశంలో స్టాక్ మార్కెట్లపై అవగాహన పెరగటంతో చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారు. దీనికి తోడు స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ రోజురోజుకు పెరుగుతోంది. కరోనా కాలం నుంచి ట్రేడర్ల సంఖ్య విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. అందుకే మార్కెట్ రెగ్యులేటర్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో భారీ మార్పులు చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో దేశంలోని అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ NSE తన F&O ట్రేడింగ్ సమయాన్ని పొడిగించే పనిలో ఉంది. ఈ ప్లాన్ అమలైతే F&O ఇన్వెస్టర్లు రోజులో ఎక్కువ గంటలు ట్రేడింగ్ చేయవచ్చు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అర్ధరాత్రి వరకు ట్రేడింగ్ అనుమతించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లు ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఈక్విటీ, డెరివేటివ్ సెగ్మెంట్లలో ట్రేడింగ్ జరుగుతున్నాయి. అయితే ఈ వేళల తర్వాత సాయంత్రం 6-9 వరకు ట్రేడింగ్ చేయవచ్చని ఎన్ఎస్ఈ సెబీ ముందు ప్రతిపాదన ఉంచింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రారంభ సమయాన్ని అర్ధరాత్రి వరకు పొడిగించవచ్చని నివేదికలు చెబుతున్నాయి. అంటే NSE F&O ట్రేడింగ్ సెషన్‌ను రాత్రి 11:30 వరకు పొడిగించాలని ఆలోచిస్తోంది. ఎన్‌ఎస్‌ఈ తన ప్రతిపాదనను ఆమోదం కోసం సెబీకి పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. F&O ట్రేడింగ్‌ను రాత్రి 11:55 వరకు, స్టాక్‌ ట్రేడింగ్‌ను సాయంత్రం 5 గంటల వరకు కొనసాగించేందుకు వీలుగా సెబీ ఇప్పటికే నిబంధనలను రూపొందించింది. సాయంత్రం వేళల్లో ట్రేడింగ్ గురించి కొన్ని నెలలుగా బ్రోకర్లు, ఇతరులకుతో ఎన్ఎస్ఈ చర్చలు జరిపింది. ఈ క్రమంలో సాయంత్రం సెషన్‌లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీతో పాటు F&Oను అనుమతించాలని ప్రతిపాదించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)