తైవాన్ చుట్టూ యుద్ధ మేఘాలు - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 13 September 2023

తైవాన్ చుట్టూ యుద్ధ మేఘాలు


చైనా, తైవాన్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. తైవాన్ విషయంలో చైనా తన దూకుడును మరింత పెంచింది. ఇందులో భాగంగా 24 గంటల్లో తైవాన్ భూభాగంలోకి చైనాకు చెందిన 22 సైనిక యుద్ధ విమానాలు, 20 యుద్ధ నౌకలు ప్రవేశించాయి. ఈ మేరకు తైవాన్ ప్రకటించింది. వీటిలో 13 యుద్ధ విమానాలు తైవాన్, చైనా మధ్య సరిహద్దు రేఖను కూడా దాటినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తైవాన్ కు 70 మైళ్ల దూరంలో షాన్ డాంగ్ నేతృత్వంలో చైనా నౌకా దళాన్ని మొహరించిందని తైవాన్ పేర్కొంది. తైవాన్ సమీపంలోకి చేరుకున్న చైనా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు..తైవాన్ చైనా జలసంధి పరిసరాల్లో యుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తాయని చైనా మీడియా వెల్లడించడం గమనార్హం. గతవారం తైవాన్ జలసంధి ద్వారా అమెరికా, కెనడా యుద్ధ నౌకలను నడిపాయి. . USS రాల్ఫ్ జాన్సన్, రాయల్ కెనడియన్ నేవీ యొక్క హాలిఫాక్స్-క్లాస్ ఫ్రిగేట్ HMCS ఒట్టావా జలసంధి గుండా ప్రయాణించాయి. అయితే చైనా వీటిని 'రెచ్చగొట్టే చర్యలు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ అమెరికా మాత్రం'నావిగేషన్ స్వేచ్ఛ' ప్రయత్నాలలో భాగమని పేర్కొంది.

No comments:

Post a Comment